ఆ అమ్మాయికి ట్రూ కాలర్ జాబ్

ఆ అమ్మాయికి ట్రూ కాలర్ జాబ్

'ఇండియాను ను వదిలి వెళ్లాలన్నది తన కల' అని చెప్పినందుకు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కు గురైన ఓ అమ్మాయికి ట్రూ కాలర్ కంపెనీలో మంచి ఉద్యోగం లభించింది. కెనడాలో బయోటెక్నాలజీ డిగ్రీ చదువుతున్న ఏక్తా అనే అమ్మాయి ఒక ఇంటర్వ్యూలో కెనడాలో సూర్యోదయం, సూర్యాస్తమయాలను వీక్షించడం తనకు చాలా ఇష్టమని పేర్కొంది. వీటిని ఇండియాలో చూడలేమని  కూడా వ్యాఖ్యానించింది. దానితో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. దీన్ని గమనించిన ట్రూ కాలర్ సీఈవో ఎలాన్ మామెది ఆమెను ఓదారుస్తూ కామెంట్ చేయడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాల్లో ఎక్కడైనా ఆమె పని చేయవచ్చునంటూ జాబ్ ఆఫర్ చేశారు.