అంబేద్కర్ జయంతి రోజున విద్యార్థులకు శుభవార్త చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు...

అంబేద్కర్ జయంతి రోజున విద్యార్థులకు శుభవార్త చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు...
  • రాష్ట్రంలో  అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటుకు కృషి చేస్తాం
  • మంథనిలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు...


ముద్ర ప్రతినిధి, పెద్దపెల్లి:-రాష్ట్రంలో  అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటుకు కృషి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, అసెంబ్లీ వ్యవహరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  అన్నారు. ఆదివారం మంథని చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి  శ్రీధర్ బాబు  మాట్లాడుతూ...

రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిని విద్యార్థులు దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో వారి ప్రావిణ్యతను పెంచడం కోసం ప్రత్యేకంగా నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు త్వరలో చేయబోతున్నామని తెలిపారు. ఎన్నికల నియమావళి అనుసరించి ఆలస్యం జరుగుతున్నదన్నారు. హైదరాబాద్ నుండి ప్రతి నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్లకు వీడియోలు, ఆడియోల ద్వారా కోచింగ్ ప్రక్రియను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నామన్నారు.

అంబేద్కర్ పేరున  విద్యను అందించాలనే ఆలోచన మేరకు ఈ నాలెడ్జ్ సెంటర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవతో ఏర్పాటు చేయబోతున్నమన్నారు. కొన్ని పార్టీలు రాజ్యాంగాన్ని వారికి అనుగుణంగా మార్చాలనే ఆలోచన చేస్తున్నాయని, గత పది సంవత్సరాలపాటు అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవస్థను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని పేర్కోన్నారు. రాహుల్ గాంధీ పిలుపుమేరకు ఈ రాష్ట్రంలో నవసమాజం, సమానత్వంతో పరిపాలనలో పూర్తిస్థాయిలో ముందుకు వెళ్తున్నామని మంత్రి  తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రూ రమాదేవి, ఎంపీపీ కొండ శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు నాయకులు  ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ అనుబంధ సంఘాల నాయకులు  పాల్గొన్నారు