మేడారం జాతర సందర్భంగా ఉచిత మందులు

మేడారం జాతర సందర్భంగా ఉచిత మందులు

డా. కేర్​లో ఆరోగ్య జాతర

ముద్ర, తెలంగాణ బ్యూరో :ఆసియాలోనే అతిపెద్ద జాతర మేడారం మహా జాతర సందర్భంగా డా. కేర్ హోమియోపతి ఉచిత మందుల పంపిణీని ప్రారంభించింది.

గురువారం నుంచి రాష్ట్రంలోని అన్ని బ్రాంచ్ లో ఉచితంగా యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు.

డా. కేర్ ఆరోగ్య జాతర లో ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ ఏఎమ్రెడ్డి మాట్లాడుతూ ఈ మందులతో జలుబు, దగ్గు, చర్మ సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రాకుండా నివారించవచ్చని డా. కేర్ వైద్యులు వెల్లడించారు. వీటిని ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవని, అన్ని వయస్సుల వారు తీసుకోవచ్చని చెప్పారు.

మేడారం జాతర సందర్భంగా డాక్టర్ కేర్ తరుపున భక్తులకు ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, గతంలో కొవిడ్ సమయంలో సేవా కార్యక్రమాలను నిర్వహించామన్నారు.

దాదాపు ఇరవై లక్షల ఇమ్యూనిటీ బూస్టర్స్ అందించామన్నారు. మేడారం జాతర సందర్భంగా రాష్ట్రంలోని డాక్టర్కేర్ బ్రాంచ్లో ఉచిత మందులు అందుబాటులో ఉంటాయన్నారు.