ఏపీలో పొత్తులపై మరోసారి స్పందించిన పురందేశ్వరి

ఏపీలో పొత్తులపై మరోసారి స్పందించిన పురందేశ్వరి
  • జనసేనతో బీజేపీ పొత్తు ఉందన్న పురందేశ్వరి
  • జనసేన మాతో తెగదెంపులు చేసుకున్నట్టు ఎక్కడా చెప్పలేదన్న ఏపీ బీజేపీ చీఫ్
  • ఇతర పార్టీలతో పొత్తులు బీజేపీ హైకమాండ్ చూసుకుంటుందని వెల్లడి 

ఏపీలో పొత్తులపై రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందేశ్వరి మరోసారి తమ వైఖరి వెల్లడించారు. ఏపీలో ఇప్పటికే జనసేనతో బీజేపీకి పొత్తు ఉందని స్పష్టం చేశారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని జనసేన కూడా ఎక్కడా చెప్పలేదు.... కనుక మాతో పొత్తులో ఉన్నట్టే అని వెల్లడించారు. అంతకుమించి ఇతర పార్టీలతో పొత్తులపై బీజేపీ కేంద్ర నాయకత్వానిదే అంతిమ నిర్ణయం అని అన్నారు. బీజేపీ పొత్తు కచ్చితంగా ఐదు కోట్ల ఆంధ్రులతో ఉంటుంది అని మీడియా ముఖంగా చెబుతున్నా అని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఏపీలో బీజేపీ ఎన్నికల సన్నద్ధత నేటితో ప్రారంభమైందని తెలిపారు.