వరుణ్ తేజ్13 త్వరలో టైటిల్ అనౌన్స్ మెంట్

వరుణ్ తేజ్13 త్వరలో టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో రూపొందుతున్న #VT13 ప్రేక్షకులు ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వాస్తవ సంఘటనల స్పూర్తితో ఇండియన్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ చిత్రంగా తెలుగు-హిందీ ద్విభాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్‌ను IAF అధికారిగా కనిపిస్తారు. ప్రేక్షకులు లార్జర్ దేన్ లైఫ్ ఎక్స్ పీరియన్స్ ని అందించడానికి మేకర్స్ అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ కోసం చిత్రీకరించడానికి మేకర్స్ భారీ సెట్‌ను రూపొందించారు. మునుపెన్నడూ చూడని ఈ యాక్షన్ కోసం వరుణ్ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించగా, మేకర్స్ నుండి మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది. మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది.