నామినేషన్ దాఖలు
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ జిల్లా : పార్లమెంట్ అభ్యర్థిగా బిజెపి పార్టీ తరఫున రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ సమర్పించిన అభ్యర్థి భరత్ ప్రసాద్ అనంతరం వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మొదటి లిస్టులో తన పేరు ప్రకటించడం నాగర్ కర్నూల్ పర్యటనలో నరేంద్ర మోడీ బహిరంగ సభలో పాల్గొనడం వల్ల నాగర్ కర్నూల్ పార్లమెంటులో కాషాయపు జెండాను ఎగురవేసి అభివృద్ధికి నాంది పలుకుతామని అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ 400 స్థానాలలో బిజెపి విజయం సాధించడం ఖాయమని అందులో నాగర్కర్నూలు పార్లమెంటు కూడా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ విశ్వ గురువుగా మారి దేశ ప్రతిష్టలు ప్రపంచానికి చాటుతున్నారని కొనియాడారు ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని అవుతున్నాడు అన్నారు.
1. ఎంపీ అభ్యర్థి భారత్ ప్రసాద్
2. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి