పేదలకు ఇళ్ల కార్యక్రమంపై కలెక్టర్లతో సీఎం జగన్​ సమీక్ష

పేదలకు ఇళ్ల కార్యక్రమంపై కలెక్టర్లతో సీఎం జగన్​ సమీక్ష

పేదలకు ఇళ్ల కార్యక్రమంపై కలెక్టర్లతో సీఎం జగన్​ సమీక్ష నిర్వహించారు. ఇళ్ల కార్యక్రమానికి సంబంధించి నిధులకు లోటు లేదన్నారు. 2022–23లో రూ. 10, 200 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ. 15, 810 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. పేదలందరకీ ఇళ్ల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. వెయ్యికి పైగా ఇళ్లు నిర్మిస్తున్న కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.