వైసీపీ ఆరో జాబితా విడుదల

వైసీపీ ఆరో జాబితా విడుదల

గుంటూరు : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నిస్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్‌సీపీ ప్రణాళిక సిద్దం చేసింది. ఈ క్రమంలో పలు అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్‌ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మారుస్తోంది. తాజాగా పార్టీ అధిష్టానం శుక్రవారం సాయంత్రం ఆరో జాబితాను విడుదల చేసింది.నాలుగు పార్లమెంట్‌, ఆరు అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలను మార్చింది వైఎస్సార్‌సీపీ అధిష్టానం. మేరుగ నాగార్జున, సజ్జల రామకృష్ణారెడ్డి ఈ జాబితాను ప్రకటించారు. రాజమండ్రి (ఎంపీ) డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, గుంటూరు ఎంపీగా ఉమ్మారెడ్డి వెంకట రమణ, నర్సాపురం ఎంపీ గూడురి ఉమాబాల(అడ్వొకేట్‌), , చిత్తూరు ఎంపీ(ఎస్సీ) ఎన్‌ రెడ్డప్ప, మైలవరం ఎమ్మెల్యే సర్నాల తిరుపతిరావు యాదవ్‌, మార్కాపురం ఎమ్మెల్యే అన్నా రాంబాబు, గిద్దలూరు ఎమ్మెల్యే కే నాగార్జున రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ఎండీ ఖలీల్‌ (డిప్యూటీ మేయర్‌గా ఉన్నారు), జీడీ నెల్లూరు కే నారాయణస్వామి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బుట్టా రేణుకగా నియమించారు. 
ఇప్పటివరకు ఐదు జాబితాల వారీగా 61 మంది ఎమ్మెల్యే నియోజకవర్గాలకు, 14 పార్లమెంట్‌ స్థానాలకు ఇన్‌ఛార్జిలను మార్చేసింది. వై నాట్‌ 175 నినాదంతో ప్రజలకు జరిగిన మంచిని, అందిన సంక్షేమాన్ని.. రాష్ట్రానికి జరిగిన అభివృద్ధిని చూపిస్తూ ఎన్నికలకు సిద్ధం అవుతోంది వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.