తెలంగాణ రాష్ట్రం కోసం  ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివి

తెలంగాణ రాష్ట్రం కోసం  ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివి

మాజీ మంత్రి స్వర్గీయ ఇంద్రారెడ్డి వర్ధంతి
 నివాళులార్పించిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్
వికారాబాద్, ముద్ర ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పరితపించిన మాజీ మంత్రి స్వర్గీయ ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. ఇంద్రారెడ్డి వర్థంతి సందర్భంగా సోమవారం వికారాబాద్ జిల్లా కౌకుంట్లలోని ఇంద్రారెడ్డి సమాధి వద్ద మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి నివాళులార్పించారు.  

ఈసందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ..  బడుగు బలహీన వర్గాలకు బాసటగా.. నిస్సహాయులకు నీడగా, పేదలకు అండగా నిలిచిన ఇంద్రారెడ్డి పేదల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచిపోయారని శుభప్రద్ పటేల్ అన్నారు.  ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్,బిఆర్ ఎస్ కేవీ  రాష్ట్ర ప్రెసిడెంట్  రాంబాబు , సీనియర్ నాయకులూ అనంత్ రెడ్డి , చిగుర్లపల్లి రమేష్ , కృష్ణ , సామ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.