కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది
- పదేళ్లలో సీఎం కేసీఆర్ పేదలకు చేసిందేమి లేదు
- మేం తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తున్నాం
- రూ 950 కోట్లతో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం
- ఆదిలాబాద్ జనగర్జన సభలో కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా
ముద్ర ప్రతినిధి , ఆదిలాబాద్ : కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. సీఎం కేసీఆర్ కారు స్టీరింగ్ తన చేతుల్లో ఉందని అనుకుంటున్నరని కాని ఆయన చేతుల్లో ఎంతమత్రం లేదన్నారు. ఆ స్టీరింగ్ ఎంఐఎం నాయకుడు ఓవైసీ చేతిలో ఉందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదిలాబాద్ పట్టణంలో ఆదిలాబాద్ జనగర్జన పేరిట బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం న ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పది సంవత్సరాల పరిపాలనలో పేద, బడుగు బలహీన ఆదివాసీ ప్రజలకు ఏమి అభివృద్ధి చేయలేదని అమిత్ షా ఆరోపించారు. ఎన్నికల సమయం కావడంవల్ల అమిత్ షా ఉపన్యాసం అంత ఎన్నికల దృష్టి తో ప్రసంగించడం విశేషం. బాసర లో గల సరస్వతి ఆలయం ,ఆదివాసుల ఆరాధ్య దైవమైన కిస్లాపూర్ నాగోబా ఆలయం, జైనత్ లో గల సత్యనారాయణ స్వామి పేర్లు తీయడంతో సభలో పాల్గొన్న ప్రజలు చప్పట్లు కొట్టారు. సభకు ఆదివాసులు పెద్ద ఎత్తున ఆదివాసులు రావడంతో ఆదివాసుల మన్నలను పొందటానికి రాంజీ గోండు దాదా,కొమురం భీం వీరులకు శ్రద్ధాంజలి అంటూ పలకరించడంతో ఆదివాసులు చప్పట్లతో హార్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కేసీఆర్ టార్గెట్ చేస్తూ అమిత్ షా ప్రసంగించారు. 10 సంవత్సరాలలో ఆదివాసులకు ఏం చేశారని ప్రశ్నించారు రూ 950 కోట్లతో నిధులతో గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసినట్లు తెలిపారు. 2014 లో గిరిజన యూనివర్సిటీ రావాల్సి ఉండగా స్థలాలు ఇవ్వకపోవడం వల్ల ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఉపాధి అవకాశాలు కోల్పోయారని ఆయన విమర్శించారు 10 ఏళ్లలో పేదల కోసం ఏం చేయలేదని ఆయన తెలుపుతూ కేసీఆర్హయంలో ఆయన కొడుకు , కూతురు బాగు పడ్డారని ఆయన విమర్శించారు కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి కేసీఆర్ఈ ఎన్నికల్లో వస్తున్నారని ఆయనకు బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడుతూ అదిలాబాద్ గడ్డ హిందువుల గడ్డ అన్నారు కేసీఆర్ కు ఏమైంది, గత కొన్నాళ్ళు గా కనబడడం లేదు. మా ముఖ్యమంత్రిని ప్రజలకు చూపెట్టాలని ఆయన అదిలాబాద్ సభ ముఖంగా కేటీఆర్‌ను కోరారు. తన గురువు కేసీఆర్ అని తన గురువు క్షేమంగా ఉండాలని అందుకే వచ్చే ఎన్నికల్లో బిజెపిని గెలిపించి కేసీఆర్ కు విశ్రాంతి ఇద్దామని అన్నారు.ఐదువేల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ ఈ అప్పు ఎలా తీరుస్తారని ఆయన ప్రశ్నించారు. పోడు భూముల పట్టాలు ఇవ్వని, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వని కేసీర్ కు ఈ ఎన్నికలలో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు బైంసా సంఘటన తమ కళ్ల ముందే ఉందని, బీజేపీ కార్యకర్తలు ధర్మం కోసం పనిచేస్తారని ధర్మం గెలుస్తుందని అన్నారు. అదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సోయం బాపూరావు మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ బడ్జెట్లో ఆర్మూరు మీదుగా రైల్వే రైల్వే లైన్ నిర్మాణానికి 5000 కోట్ల ఆయన తెలిపారు.
ఆదిలాబాద్లో వచ్చే ఎన్నికలలో జిల్లాలో అన్ని స్థానాలలో గెలిపించాలని రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి చిట్యాల సువాసన రెడ్డి నిర్మల్ బిజెపి జిల్లా అధ్యక్షురాలు రమాదేవి బిజెపి నాయకులు అయ్యన్న గారి భూమయ్య రామ్నాథ్ సూర్యకాంత్ గిత్తే,బాబా రావు, మాధవ్ రావు అంటే, రఘపతి గ్రామీణ, మండల, జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అదిలాబాద్ నిర్మల్ జిల్లా నుండి బిజెపి నాయకులు ప్రజలను తరలించారు. సభకు ఆదిలాబాద్ ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సక్సెస్ కావడం పట్ల బీజేపీ నాయకులలోనూతన ఉత్తెజం కలిగింది.