తొమ్మిదేళ్ళైనా పూర్తి కాని ఆర్ఓబి.?

తొమ్మిదేళ్ళైనా పూర్తి కాని ఆర్ఓబి.?

•వెంటనే పనులు పూర్తి చేయాలి

•బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ 

రామకృష్ణాపూర్, ముద్ర : చెన్నూరు నియోజవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అసమర్థతతోనే క్యాతన్ పల్లి ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణ పనులు తొమ్మిదేళ్ళైనా పూర్తి కాలేదని మంచిర్యాల జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షులు వేరబెల్లి రఘునాథ్ ఆరోపించారు. బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో టిఫిన్ బై టాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా   బిజెపి నాయకులు, కార్యకర్తలు ఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్ బాక్సులతో మధ్యాహ్న సహాపంక్తి భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ పట్టణంలో ఏర్పడిన రహదారులు,పూర్తి కానీ రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులపై ఎమ్మెల్యే బాల్క సుమన్ ను ప్రజలు నిలదీయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మహంకాళి శ్రీనివాస్, పార్లమెంటు కో- కన్వీనర్ నగునూరి వెంకన్న, చెన్నూరు నియోజవర్గ కన్వీనర్ అక్కల రమేష్, రాష్ట్ర నాయకులు ఆరుముళ్ళ పోషం,సీనియర్ నాయకులు దీక్షితులు,బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వెంకటకృష్ణ, జైపూర్ అధ్యక్షులు విశ్వంభర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ,మహిళా నాయకురాలు వేముల సరస్వతి, వైద్య శ్రీనివాస్,రాజయ్య,సంతోష్ రామ్,సాయి,ప్రసాద్,సతీష్,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.