మంథనిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలో తీవ్ర ఉద్రిక్తత

మంథనిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలో తీవ్ర ఉద్రిక్తత
  • అంబేద్కర్ చౌరస్తాలో పోటా పోటీ ప్రచారం ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
  • లాఠీ చార్జ్ చేసే వరకు పరిస్థితి 
  • అదువులోకి తీసుకొచ్చిన మంథని సిఐ సతీష్

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:  మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం సాయంత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్త నెలకొంది. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార రథం చౌరస్తా ప్రాంతానికి చేరుకోవడంతో ఎదురుగా  బీఆర్ఎస్ పార్టీ ప్రచార రథం రావడంతో తీవ్ర ఉధృత వాతావరణం నెలకొంది. పోటాపోటీగా ఇరువార్గల వారు నాయకులపై రూపొందించిన ఆడియో క్యాసెట్ల ద్వారా పాటలు వేయడంతో చౌరస్తా ప్రాంతంలో అలజడి వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న మంథని సీఐ సతీష్ తమ సిబ్బందితో చౌరస్తా కు చేరుకొని ఇరు వర్గాలను శాంతింప చేశారు. 

ఇరు వర్గాల వారు వెళ్లిపోయినట్లే పోయి  తర్వాత మళ్లీ తిరిగి ఇరు పార్టీల వారు చౌరస్తా ప్రాంతంలో చేరుకోవడంతో తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది, తీవ్ర ఉద్రిక్తల మధ్య లాఠీ చార్జ్ జరిగే పరిస్థితులు  ఏర్పడ్డాయి. తిరిగి మళ్లీ మంథని సీఐ సతీష్ చాఖచార్యంగా వ్యవహరించి ఇరు వర్గాలకు నచ్చ చెప్పడం తో  పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంథనిలో రెండు రాజకీయాల పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో మంథనిలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంథని పై పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి శాంతి భద్రతలను అదుపులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.