ఎంత మందిని కంటావ్ అంటూ గర్భిణీని తిట్టిన ప్రభుత్వాస్పత్రి డాక్టర్....నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన

ఎంత మందిని కంటావ్ అంటూ గర్భిణీని తిట్టిన ప్రభుత్వాస్పత్రి డాక్టర్....నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన

ముద్ర,తెలంగాణ:- నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మైనార్టీ గర్భిణీ మహిళకు అనుకోని సంఘటన ఎదురైంది. ఒక ముస్లిం మైనార్టీ మహిళ డాక్టర్ వద్దకు వెళ్లి చెకప్ చేయించుకుంటున్న సమయంలో డాక్టర్ తనని ఎన్నో కాన్పు అని అడగగా సదరు మహిళ ఐదో కాన్పు అని తెలిపింది. నీకు సిగ్గు లేదా ఎంత మందిని కంటావ్ అని ఇష్టం ఉన్న రీతిలో డాక్టర్​ అసభ్య పదజాలంతో బూతులు తిట్టిందని ఆమె తెలిపారు.ఈ సంఘటన తో ఆ మహిళ ఆసుపత్రిలో కన్నీరు మున్నీరు అయ్యింది. ఆరోగ్యం కోసం ఆసుపత్రికి వస్తే ఇలాంటి అవమానకరంగా మాట్లాడటం ఏంటి ఆ దంపతులు వాపోయారు.ఈ విషయంపై మహిళ భర్త సదరు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశాడు.