బాబు జగ్జీవన్ రామ్ జీవిత చరిత్రను ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

బాబు జగ్జీవన్ రామ్ జీవిత చరిత్రను ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

ముద్ర ప్రతినిధి జగిత్యాల: బాబు జగ్జీవన్ రామ్ జీవిత చరిత్రను ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 117వ జన్మదిన వేడుకలను కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ  సందర్బంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయన చేసిన సేవలు భావి తరాల వారికి ఉపయోగపడుతున్నా యని  ఆయన సమాజం కోసం, అన్నీ వర్గాల సంక్షేమం కోసం విశేష కృషి చేశారని అన్నారు. 40 సంవత్సరాలు రాజకీయ సేవలు అందించారని, 1965 లో గ్రీన్ రెవల్యూషన్ ప్రారంభించారని తెలిపారు.  1971 లో ఇండియా పాకిస్తాన్ యుద్ద సమయంలో ఆయన రక్షణ మంత్రిగా పనిచేశారని తెలిపారు.

భారత రాజ్యాంగ నిర్మాణంలో ముఖ్య పాత్రను పోషించారని తెలిపారు. అస్పృశ్యత నివారణకై పోరాటం చేశారని తెలిపారు. నిజమైన అర్హత కలిగిన వారికి సహకారం అందించాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర మాట్లాడుతూ, జగ్జీవన్ రామ్ చరిత్ర ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని అన్నారు. న్యాయం, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. అదనపు కలెక్టర్ పి.రాంబాబు మాట్లాడుతూ, జగ్జీవన్ రామ్ బీహార్ లో జన్మించారని, మూడ నమ్మకాలను రూపుమాపాడారని అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వినోద్ కుమార్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి రాజ్ కుమార్,అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.