విజయవాడకు సూపర్‌స్టార్ రజనీకాంత్
విజయవాడకు సూపర్‌స్టార్ రజనీకాంత్ వచ్చారు. ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికిన ఎమ్మెల్యే బాలకృష్ణ. ఒకే కారులో నోవాటెల్‌కు వెళ్లిన రజనీకాంత్, బాలకృష్ణ. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన రజనీకాంత్. సాయంత్రం ఉండవల్లిలో రజనీకాంత్‌కు చంద్రబాబు నాయుడు తేనేటీ విందు ఇస్తారు. అనమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరుగుతాయి. విజయవాడకు చేరుకున్న నందమూరి కుటుంబ సభ్యులు. నందమూరి రామకృష్ణ, లోకేశ్వరి, మనవడు శ్రీనివాస్ వచ్చారు. ఎస్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. భావితరాలకు ఎన్టీఆర్ స్ఫూర్తిని అందిస్తామని రామకృష్ణ అన్నారు. శతజయంతి వేడకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని లోకేశ్వరి అన్నారు.