చంద్రబాబు నాయుడు అరెస్ట్ 

చంద్రబాబు నాయుడు అరెస్ట్ 

నంద్యాల:నంద్యాలలో అర్ధరాత్రి నుంచి హైడ్రామా చోటు చేసుకుంది. శనివారం  తెల్లవారుజామున టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్‌ చేశారు. చంద్రబాబు అరెస్ట్ వార్తలతో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా కలకలం రేగింది. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఫంక్షన్‌ హాల్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో అరెస్ట్‌ చేయవచ్చన్న వార్తలకు బలం చేకూరింది. పోలీసు ఉన్నతాధికారులు అదనపు బలగాలను నంద్యాలకు పంపనున్నారన్న వార్తలతో మరిన్ని అనుమానాలు పెరిగాయి.  అరెస్ట్‌ ప్రచారం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఫంక్షన్‌ హాల్‌ వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. అయితే చంద్రబాబును విజయవాడకు తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.