గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు అరెస్టు

గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు అరెస్టు

విశాఖపట్నం :  స్కిల్ డెవలప్​మెంట్​  కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అయన కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబు అరెస్టుపై గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ  చంద్రబాబును అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. 

ఆయన దేశరాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని అన్నారు. అర్థరాత్రి హైడ్రామ చేశారని విమర్శించారు. 

జగన్ మోహన్ రెడ్డి ఆనందం కోసం మాత్రమే చంద్రబాబును అరెస్ట్ చేశారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళారని,  ఆ అక్కసుతోనే  చంద్రబాబును అరెస్ట్ చేయించినట్టు ఉందని అన్నారు. ఆయనకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. రాబోయే  ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు.

మొదటిసారి తన పేరు కూడా యాడ్ చేశారని, ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు.