కొడంగల్ లో 100 శాతం పోలింగ్

కొడంగల్ లో 100 శాతం పోలింగ్

ప్రశాంతంగా మహబూబ్ నగర్  స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుని ఎన్నికల పోలింగ్ కొడంగల్ ఎండిఓ కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్, ముద్ర ప్రతినిధి: ఉమ్మడి     మహబూబ్ నగర్  స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుని ఉప ఎన్నికకు సంబంధించి గురు వారం కొడంగల్ లో వంద శాతం పోలింగ్ జరిగింది.  కొడంగల్ నియోజకవర్గం లోని దౌల్తాబాద్, బొమ్మరాస్ పేట్,  కొడంగల్ మండలాల పరిధిలో 56 మంది ఓటర్లు ఉండగా అందులో ముగ్గురు జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, 40 మంది మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం సభ్యులు, 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు పట్టణ స్థానిక సంస్థల ఎక్స్ ఆఫీషియో సభ్యులైన శాసనసభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి కొడంగల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

శాసనం మండలి ఎన్నికల్లో ఎక్స్ ఆఫీసులో సభ్యునిగా ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.   పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రక్రియను ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు, జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి, జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి లు సందర్శించి  పరిశీలించారు. కాగా కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నారాయణరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి నవీన్ రెడ్డి లు పోటీ పడ్డారు.