బందరు పోర్టుతో  తెలంగాణకు ఉపయోగం: సీఎం జగన్​

బందరు పోర్టుతో  తెలంగాణకు ఉపయోగం: సీఎం జగన్​

బందరు పోర్టు తెలంగాణకు ఉపయోగపడుతుందని సీఎం జగన్​ చెప్పారు. పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తరువాత సభలో మాట్లాడుతూ బందరువాసుల  కలను నెరవేర్చామన్నారు. గుడివాడ–మచిలీపట్నం రైల్వేలైన్ కు పోర్టను అనుసంధానం చేస్తామన్నారు. త్వరలో మచిలీప్నటం రూపురేఖలు మారతాయన్నారు. మరో 24 నెలల్లో పెద్దపెద్ద ఓడలు కనిపిస్తాయని చెప్పారు. పోర్టు ఆధారిత పరిశ్రమలతో లక్షలాదిమందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. బందరు పోర్టు రాకుండా చంద్రబాబు నాయకుడు అడ్డుకున్నారని విమర్శించారు. మచిలీపట్నానికి చంద్రబాబు తీరని ద్రోహం చేశారని అన్నారు. బందరు పోర్టు కృష్ణా జిల్లా చరిత్రను మార్చబోతోందన్నారు.