ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బీభత్సం.. మృతి చెందిన 12 ఏళ్ల బాలుడు

ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బీభత్సం.. మృతి చెందిన 12 ఏళ్ల బాలుడు

ముద్ర,అనకాపల్లి:- అనకాపల్లి జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు బీభత్సం సృష్టించింది.ఈ మేరకు కసింకోట బయ్యవరం దగ్గర జాతీయ రహదారి పక్కన ఉన్న టిఫిన్ వాహనంపైకి బస్సు దూసుకెళ్లింది.ఈ క్రమంలోనే మూడు బైకులు, కారుతో పాటు ఓ వ్యాన్ ను బస్సు ఢీకొట్టింది.దీంతో వాహనదారులుతీవ్ర భయాందోళనకు గురయ్యారు.ఈ ప్రమాదంలో ఓ బాలుడు మృత్యువాత పడ్డాడని సమాచారం.అలాగే పది మందికి పైగా గాయాలు కాగా.వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులుఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.