రాపాకకు టీడీపీ  డబ్బులు ఆఫర్ చేయలేదు

రాపాకకు టీడీపీ  డబ్బులు ఆఫర్ చేయలేదు

తనపై  జనసేన ఎమ్మెల్యే  రాపాక  వరప్రసాద్ చేసిన ఆరోపణలపై  టీడీపీ ఎమ్మెల్యే  మంతెన రామరాజు స్పందించారు. రాపాక వరప్రసాద్ ఆరోపణలను మంతెన రామరాజు తోసిపుచ్చారు., ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధికి ఓటేయాలని టీడీపీ ఎమ్మెల్యే ప్రలోభ పెట్టారని జనసేన ఎమ్మెల్యే  రాపాక వరప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారంనాడు టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజుఈ విషయమై స్పందించారు. రాపాక వరప్రసాద్ పై తాను ఈ విషయాలపై చర్చించలేదన్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగా వైసీపీలోని అసంతృప్తులు తమకు ఓటు చేస్తారని  నమ్మకం ఉందన్నారు. ఈ కారణంగానే తాము ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ధిని బరిలోకి దింపామన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేస్తే రాపాక వరప్రసాద్ కు ఆఫర్ ఇచ్చినట్టుగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే తాను ఏం చెబుతానన్నారు. వ్యక్తిగతంగా తాను రాపాక  వరప్రసాద్ ను కలవలేదన్నారు. తనపై  రాపాక వరప్రసాద్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారో అర్ధం కావడం లేదన్నారు. అసెంబ్లీ లాబీల్లో ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో  స్నేహపూర్వకంగానే మాట్లాడుతానన్నారు. అసెంబ్లీ లాబీల్లో  ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో స్నేహపూర్వకంగానే మాట్లాడుతానన్నారు.. తమకు అసెంబ్లీలో  23 మంది ఎమ్మెల్యేలున్నారని  మంతెన  రామరాజు చెప్పారు. తమ పార్టీకి చెందిన వారిలో కొందరు  ఓటేయకపోయినా వైూసీపీ రెబెల్స్ ఓటేస్తారని నమ్మకం ఉందన్నారు.