నీటి కొరతతో ఓయూ లో హాస్టళ్ల మూసివేత..

నీటి కొరతతో ఓయూ లో హాస్టళ్ల మూసివేత..

ముద్ర ప్రతినిధి, మేడ్చల్: నీళ్ళు,విద్యుత్ కొరత కారణంగా ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టళ్లను, మెస్ ను మూసివేయనున్నారు. నీటి, విద్యుత్ కొరత తీవ్రంగా ఉండడంతో మే 1 నుంచి 31 వరకు హాస్టల్స్ ను మూసివేస్తున్నట్లు చీఫ్ వార్డెన్ ఓ ప్రకటనను విడుదల చేశారు. విషయం తెలిసిన అక్కడి విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే లేడీస్ హాస్టల్లో నీరు,విద్యుత్ సరఫరా చేయాలని విద్యార్థులు ధర్నా చేశారు.