నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యం - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:నిరుపేదల జీవితాల్లో వెలుగులు తీసుకరావడమే ప్రభుత్వ లక్ష్యమని ఎస్సి, ఎస్టీ, బిసి. మైనార్టిటి సంక్షేమ శాఖల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టి ఎన్జీవోస్, క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్ర ;స్థాయిలో అమలు చేసి ప్రజలకు ఫలాలను అందించడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని, వారి పట్ల ప్రభుత్వం ఫ్రెండ్లిగా ఉంటుందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని, ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసిన 317 జి.ఓ. పున : సమీక్షించుదుటకు కమిటీ వేశామన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ విధులు సక్రమంగా నిర్వర్తించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు వంద శాతం అమలయ్యే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు చూడాలన్నారు. ప్రజలు కట్టే పన్నుల ద్వారా జీతం తీసుకుంటున్నామని మన్న ఉద్యోగులు ఆత్మ పరిశీలన చేసుకొని,సక్రమంగా పనిచేయాలని సూచించారు. నూతన ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో రెండు పధకాలు అమలు పరిచామని, ఈ నెల 27 న మంగళవారం నాడు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే సిలిండర్ అందించే మరో రెండు పథకాలను ప్రారంభించనున్నామన్నారు. ఇప్పటికే 27 వేల ఉద్యోగాలు ఇచ్చామని, వంద రోజుల్లో 50 వేల ఉద్యోగాలు ఇవ్వనున్నామన్నారు. మాట ఇచ్చిన ప్రకారం ఏడాదిలోగా 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని షబ్బీర్ అలీ తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. టీఎన్జీవోస్, టీజీవో భవనాల నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ఉద్యోగులు సమిష్టిగా పనిచేసి జిల్లాను అన్ని రంగాలలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే విధంగా చూస్తున్నారని కొనియాడారు. జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమం విజయవంతం కావడానికి ఉద్యోగులు కృషి అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఉద్యోగ సంఘాల జేఏసీ, టీజీవో ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర టి జి ఓ ఎస్ అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, కార్యదర్శి బి. సాయిలు, టిజివో జిల్లా అధ్యక్షుడు దేవేందర్, కార్యదర్శి సాయి రెడ్డి, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అలుక కిషన్, ఉమ్మడి జిల్లా సమన్వయకర్త శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు