దర్గా దర్శనానికి వెళ్లి....మృత్యువు ఒడిలోకి  !!      

దర్గా దర్శనానికి వెళ్లి....మృత్యువు ఒడిలోకి  !!      
  • బడపహాడ్ దర్గాకు వెళ్తుండగా ఆటో బోల్తా
  • అత్తా, అల్లుడి మృతి    
  • 9 మందికి గాయాలు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి : రంజాన్ పండుగ జరుపుకున్న తర్వాత ప్రత్యేక ప్రార్థనల కోసం నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బడాపహాడ్ దర్శనానికి ఆటోలో వెళ్ళ్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటనలో అత్త, అల్లుడు అక్కడికక్కడే మృతి చెందగా 9 మంది గాయాల పాలయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయ్. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనికి చెందిన మొయిన్ (38)తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం రాత్రి బడాపహాడ్ కు ఆటోలో బయలుదేరారు.  బాన్సువాడ-బడాపహాడ్ రోడ్డుపై హన్మాజీపేట దాటిన తర్వాత నిద్రమత్తు  కారణంగా బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న మొయిన్ (38 ) అహ్మది (52 )లు అక్కడికక్కడే మృతి చెందారు.  ఆటోలో మొత్తం 9 మంది ఉండగా అందరికి గాయాలయ్యాయి.  ఆటోలో నలుగురు చిన్నారులు అమ్రీన్,అయాన్, ఆహిల్,  అనాబియ పెద్దలు జుబేర్, సుల్తానా, ఆలియలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. కాగా ఆటోను కొని కేవలం 20 రోజులు మాత్రమే అయిందని స్థానికులు తెలిపారు. ఇద్దరి మృతితో సంగమేశ్వర కాలనిలో ఇద్దరి మృతితో విషాద ఛాయలు అలముకున్నాయి.