సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ 

సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ 
  • సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు

ముద్ర ప్రతినిధి, వరంగల్: తెలంగాణ విలీనంపై బీజేపీ, కాంగ్రెస్,  బీఆర్​ఎస్​లు నకిలీ ప్రేమలు చెబుతున్నాయని.. సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా వరంగల్లో బుధవారం సీపీఐ  జిల్లా సమితి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన, సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలను మభ్య పెట్టేందుకు మూడు పార్టీలు మూడు విధాలుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని, ట్యాంక్ బండ్ పై సాయుధ పోరాట యోధుల విగ్రహాలు పెడతామని, పాఠ్య పుస్తకాల్లో చేరుస్తామని చెప్పిన కేసీఆర్ ఎందుకు ఆ హామీలను అమలు చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ మాత్రం సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ.. హిందూ ముస్లింల గొడవగా చిత్రీకరిస్తోందన్నారు. బిజెపి ఆర్ఎస్ఎస్ పాత్ర సాయిధ పోరాటంలో ఏమాత్రం లేదని నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని అన్నారు. సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య సహా నాలుగున్నర వేల మంది అమరులయ్యారని తెలిపారు. ఇప్పటికీ ఆ చరిత్ర వాళ్ళు గ్రామాల్లో దర్శనమిస్తాయని అన్నారు.  కార్యక్రమంలో మేకల రవి, బిక్షపతి, నంద్యాల రమేష్, షేక్ బాష్మియా , ప్రసాద్, శంకరయ్య, రమేష్, రవీందర్, దందు లక్ష్మణ్, మునీశ్వరుడు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.