శాఖాపూర్ లో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన
వెల్గటూర్, ముద్ర : వెల్గటూర్ మండలంలోని శాఖాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయంలో బుధవారం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలందరూ బోనాలతో ఆలయ వద్దకు తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్, నాయకులు పంజాల తిరుపతి, రవి, తదితరులు పాల్గొన్నారు.