వేసవి సెలవుల సమయంలో విద్యార్థులకు సాంస్కృతి కార్యక్రమాలను నేర్పించాలి - ఎస్ఐ నందికర్

వేసవి సెలవుల సమయంలో విద్యార్థులకు సాంస్కృతి కార్యక్రమాలను నేర్పించాలి -    ఎస్ఐ నందికర్

ముద్ర,వీపనగండ్ల: వేసవి సెలవుల సమయంలో తల్లిదండ్రులు విద్యార్థులకు ఆటలు పాటలు డాన్సులు వంటి సాంస్కృతి కార్యక్రమాలను నేర్పించడం అలవాటు చేయాలని వీపనగండ్ల ఎస్ఐ నందికర్ అన్నారు.మండల కేంద్రంలోని డాఫోడిల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నూతన విద్యా సంవత్సరం క్యాలెండర్ ను స్థానిక ఎస్సై నందికర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై నందికర్ మాట్లాడుతూ ఎండ తీవ్రత పెరుగుతుండడంతో విద్యార్థులు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా బయటకు వెళ్ళకూడదని సూచించారు. వడదెబ్బకు గురికాకుండా తల్లిదండ్రులు కూడా ఎండాకాలంలో నిరంతరం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు జ్ఞాన సంపదను పెంపొందించుటకు ప్రత్యేక శ్రద్ధ కనబడుచాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బి రాముడు ఉపాధ్యాయులు లక్ష్మి  ,కళ్యాణి ,రాజేశ్వరి, మాసుంబి, మౌనిక ,పార్వతి తల్లిదండ్రులు నాగరాజు, సత్యనారాయణ ,చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.