సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

ముద్ర,పానుగల్:-భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతిని బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీరామ్, కళావతమ్మ లు మాట్లాడుతూ ఈ దేశానికి దశ దిశ నిర్దేశిస్తూ రాజ్యాంగం రాసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలో అన్ని వర్గాల కు అవకాశాలు కల్పిస్తూ రాజ్యాంగం రాశారని ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అన్నారు. ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయగా దాన్ని వక్రీకరించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మతం పేరుతో ప్రజలను విడదీసే పాలన చేస్తోందని, ప్రజాస్వాంకవాదులు అంబేద్కర్ వర్ధంతి రోజు సెక్యులర్ రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రతిన పూనాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శి ఎర్రకుర్మయ్య, తెల్ల రాళ్లపల్లి ఉప సర్పంచ్ కాకం బాలస్వామి, ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి వంశీ, ఏఐవైఎఫ్ నాయకులు మనుసాగర్, సీనియర్ నాయకులు భూపాల్, మహిళా సమాఖ్య నాయకులు వెంకటమ్మ, బేబీ లలిత తదితరులు పాల్గొన్నారు.