క్రూరమైన దాడులను అడ్డుకోవడానికే దంతెవాడ దాడి
దంతెవాడ ఘటనపై మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ దాడి చేసినట్లు పేర్కొన్నారు. సదరన్ సబ్ జోనల్ బ్యూరో పేరిట మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. 17 మంది గ్రామస్తులను జవాన్లు విచక్షణ రహితంగా కొట్టారని తెలిపారు. గ్రామస్తులను అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. క్రూరమైన దాడులను అడ్డుకోవడానికే దంతెవాడ దాడి జరిగిందన్నారు. సదరన్ సబ్ జోనల్ బ్యూరో పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.