చల్లబడిన భాగ్యనగరం...ఉరుములు, ఈదురుగాలులతో వాన.. పలుచోట్ల వడగండ్లు

చల్లబడిన భాగ్యనగరం...ఉరుములు, ఈదురుగాలులతో వాన.. పలుచోట్ల వడగండ్లు

ముద్ర,తెలంగాణ:- తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా వర్షం కురవడం ప్రారంభమైంది. పలు ప్రాంతాల్లో సాయంత్రం ఐదు గంటలకే చీకట్లు అలుముకున్నాయి. తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, కుమురంబీమ్ అసిఫాబాద్, ములుగు, జనగామ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది.

హైదరాబాద్‌ జంట నగరాల పరిధిలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. కూకట్‌పల్లి, నిజాంపేట, కేపీహెచ్‌బీ, లిగంపల్లి, కొండాపూర్‌ తో పాటు… జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, గచ్చిబౌలి, రాయదుర్గంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కుమ్మేస్తొంది. మియాపూర్‌లో పలుచోట్ల వడగళ్ల వాన కురిసింది.

ఇక సికింద్రాబాద్‌, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, ప్యారడైజ్‌, మారేడ్‌పల్లి, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, సుచిత్ర, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, పేట్‌బషీరాబాద్‌ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి., రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.