జిలుగు విత్తనాల పంపిణీ ప్రారంభించిన ఎమ్మేల్యే

జిలుగు విత్తనాల పంపిణీ ప్రారంభించిన ఎమ్మేల్యే

పెద్దశంకరంపేట, ముద్ర: రైతుల సంక్షేమం కోసం తమ  ప్రభుత్వం కట్టుబడి ఉందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డీ అన్నారు. బుదవారం నాడు ఆయన పెద్దశంకరంపేట మండల కేంద్రంలో భూపాల్ రెడ్డి 
జీలుగ విత్తనాల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ పెద్దశంకరం పేట లో జిలుగు విత్తనాలు అందుబాటులో ఉంటాయన్నారు.  కావాల్సిన రైతులు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ లతో  ఏఈఓ వద్ద నమోదు చేసుకొని జీలుగ  కోసం రూ. 8550 చెల్లించి 30 కేజీల బ్యాగ్ తీసుకోవాలన్నారు. వారితో పాటుగా జెడ్పీటీసీ విజయ రామ రాజు, ఎంపీపీ జంగం శ్రీనివాస్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు సురేష్ గౌడ్, ఖేడ్ జడ్పీటీసీ రవీందర్ నాయక్, నగేష్, లింగయ్య  తదితరులు పాల్గొన్నారు.