చేవెళ్ళ కాంగ్రెస్​ జనజాతర సభను విజయవంతం చేయండి

చేవెళ్ళ కాంగ్రెస్​ జనజాతర సభను విజయవంతం చేయండి

హస్తం పార్టీ  నేతలు, కార్యకర్తలకు ఎంపీ డాక్టర్​ జి. రంజిత్​ రెడ్డి పిలుపు

మొయినాబాద్​: కాంగ్రెస్​ పార్టీ చేవెళ్ళ పార్లమెంట్​ నియోజకవర్గ ప్రాంతంలో శనివారం (రేపు)  నిర్వహించ తలపెట్టిన జనజాతర భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎంపీ డాక్టర్​ జి.రంజిత్​ రెడ్డి పిలుపునిచ్చారు. హస్తం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఈ మేరకు శుక్రవారం ఆయన సూచించారు. మన దేశ భవిష్యత్తుకు… ఈ ప్రాంత అభివృద్ధికి కీలకమైన లోక్​ సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డమీద నుంచి కాంగ్రెస్ పార్టీ “జంగ్ సైరన్” మోగించనుందని ఆయన గుర్తు చేశారు. 

పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు ఇచ్చే భరోసా (మేనిఫెస్టో)ను ఈ వేదిక నుంచే కాంగ్రెస్​ అధినాయకత్వం విడుదల చేయడం హర్షణీయమని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ 14 స్థానాలు గెలుస్తుందని.. చేవెళ్ళ బంపర్​ మెజార్టీతో గెలుస్తామని రంజిత్​ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తమ పార్లమెంట్​ నియోజకవర్గం నుంచి తుక్కుగూడ సభకు పెద్ద సంఖ్యలో హాజరు అవుతున్నట్టు… ఈ మేరకు జన సమీకరణ చేస్తున్నామని వివరించారు.