ముఖ్యమంత్రిని కలిసిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య

ముఖ్యమంత్రిని కలిసిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య

విజయదశమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఆగయ్య
ముద్ర,ఎల్లారెడ్డిపేట : విజయదశమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను మంగళవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య హైదరాబాదులోని ప్రగతి భవన్ కు వెళ్లి కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ ప్రతిష్టకు మరింత కృషి చేయాలని ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటీఆర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని సూచించినట్లు సమాచారం.