అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లు ఇవ్వాలి

అర్హులందరికీ  డబుల్ బెడ్రూమ్   ఇండ్లు లు ఇవ్వాలి
Members of TPCC are Naga Sitarams
  • అవకతవకలు బయటపడ్డా అధికారులు పట్టించుకోరా ?
  • డబుల్ అక్రమాలను రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్తా: టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు 

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ పంపిణీ చేయాలని టి పి సి సి సభ్యులు నాగశీతారములు  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపికలో అన్యాయం జరిగిందంటూ బాధిత మహిళలు శనివారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మద్దతు తెలిపిన టీపీసీ సభ్యులు నాగ సీతారాములు మాట్లాడుతూ భద్రాద్రి జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ల లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలు కలకలం రేపుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తకుండా ఉండటం శోచనీయమని అన్నారు. మహిళ కౌన్సిలర్ భర్త నిరుపేదల నుంచి 1 లక్ష రూపాయలు అడిగినట్లు  ఆడియో బయటకు వచ్చిన కూడ ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు స్పందించక పోవడం దారుణం అన్నారు.

ఈ దందాలో ప్రజా ప్రతినిధులపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను ఆశ చూపించి డబ్బులు తయారు చేసుకోవాలని పేదలను మభ్య పెట్టిన ప్రజాప్రతినిధుల భర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీపీఎల్‌ పరిధిలో ఉన్న వారికే ప్రయోజనం చేయాలనే సంకల్పంతో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను అనర్హులకు ఇచ్చారని ఇది బాధకరమన్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బందిని తప్పు దోవ పట్టించి కొందరు నేతల ప్రమేయంతోనే ఈ అక్రమం జరిగినట్టు ఆయన ఆరోపించారు. ఈ దందాపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే, అసలు దొంగలు బయటపడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇంటితో పాటుగా, సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇస్తామన్నా రు.కొత్తగూడెం నియోజకవర్గంలో జరిగిన డబుల్ బెడ్రూమ్ అక్రమాలను రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క దృష్టికి తీసుకోని వెళ్తానని ఆయన తెలిపారు.