Andrey Botikov brutally murdered కరోనా వ్యాక్సిన్‌ శాస్త్రవేత్త దారుణ హత్య..!

Andrey Botikov brutally murdered కరోనా వ్యాక్సిన్‌ శాస్త్రవేత్త దారుణ హత్య..!
Corona vaccine scientist Andrey Botikov

మాస్కో: రష్యాలో ప్రముఖుల మరణాల వెనుక రహస్యమేంటో అంతుచిక్కట్లేదు. తాజాగా మరో ప్రముఖ శాస్త్రవేత్త దారుణ హత్యకు గురయ్యారు. కరోనా వ్యాక్సిన్‌  అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్న శాస్త్రవేత్త ఆండ్రీ బొటికోవ్‌ను ఓ వ్యక్తి తన అపార్ట్‌మెంట్‌లోనే హత్య చేశాడు. బెల్ట్‌ను గొంతుకు బిగించి చంపేశాడు. ఈ మేరకు రష్యా మీడియా కథనాలు  వెల్లడించాయి.  47 ఏళ్ల బొటికోవ్‌ మాస్కోలోని గమాలియా నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ ఎకాలజీ అంట్‌ మ్యాథమెటిక్స్‌లో సీనియర్‌ పరిశోధకుడిగా పనిచేస్తున్నారు. గురువారం ఆయన తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కన్పించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఓ అనుమానితుడిని అరెస్టు చేశారు.

బొటికోవ్‌తో నిందితుడు ఏదో విషయంలో గొడవ పెట్టుకున్నాడని, ఆ తర్వాత బెల్ట్‌తో అతడి గొంతు నులిమి అక్కడి నుంచి పారిపోయాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని అధికారులు చెప్పినట్లు రష్యా  న్యూస్ ఏజెన్సీ టాస్‌ కథనం వెల్లడించింది. అయితే, హత్యకు గల కారణాలేంటనే దానిపై పూర్తి స్పష్టత లేదు. 2020లో రష్యాలో 'స్పుత్నిక్‌ వి ' వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన 18 మంది శాస్త్రవేత్తల బృందంలో బొటికోవ్‌ ఒకరు. కొవిడ్ టీకా తయారీలో ఆయన చేసిన సేవలకు గానూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్  2021లో ఆయనను 'ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ ఫర్‌ ది ఫాదర్‌లాండ్‌' పురస్కారంతో సత్కరించారు. అలాంటి వ్యక్తి ఓ ఆగంతకుడి చేతిలో ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది.