నా ఆశ.. నా శ్వాస..  తెలంగాణ 

నా ఆశ.. నా శ్వాస..  తెలంగాణ 
  • రాష్ట్రం ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది.. 
  • అభివృద్ధిలో గజ్వేల్ అన్నిరంగాల్లో ముందుకు
  • మళ్లీ గెలిపిస్తే గజ్వేల్ లో దళితుల కుటుంబాలకు  ఒకే విడతలో దళిత బంధు
  • ఇందిరమ్మ రాజ్యం అంటే అరచకమే!
  • తెలంగాణకు బీజేపీ చేసింది ఏమీ లేదు!
  • గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభలో రాష్ట్ర సీఎం చంద్రశేఖర్ రావు 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట (గజ్వేల్) : 24 యేళ్లుగా తెలంగాణ తన ఆశ.. శ్వాశ..  అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గజ్వేల్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సాధనకు సిద్దిపేట గడ్డ అండగా నిలబడితే సాధించిన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపేందుకు అండగా నిలబడ్డది గజ్వేల్ అని అన్నారు. గజ్వేల్ తన గౌరవాన్ని నిలబెట్టిందన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. అయిన తట్టుకొని నిలబడి కేసీఆర్ సచ్చుడో.. తెలంగాన వచ్చుడో అనే సంకల్పంతో తెలంగాణ సాధించానని తెలిపారు. దేశంలోని 33 పార్టీలు లాతో లేఖలు ఇప్పించి తెలంగాణ సాధించామన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటున్న విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీనా, ఎన్​కౌంటర్ల, చీకటి రోజుల అని ప్రశ్నించారు. ఇంతటి చరిత్ర ఉన్న ఇందిరమ్మ రాజ్యం ఎవడికి కావాలని ప్రశ్నించారు. 1969వ ఉద్యమంలో 400 మందిని కాల్చి చంపిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. అందుకే ఎన్టీఆర్ పార్టీ స్థాపించారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ వచ్చి రైతుబంధు దండగ అంటున్నాడని.. ప్రస్తుత అధ్యక్షుడు కరెంట్ 24గంటలు దండగా అంటున్నాడని ఇవి దండగేనా అని ప్రజలను ప్రశ్నించారు. కాదని ప్రజలు సమాధానం ఇవ్వవడంతో మళ్లీ  గెలిపిస్తే రైతుబంధు రూ.16వేలకు పెంచుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు సచ్చేది లేదు. వారికి ఓటేయ్యడం దండగా అని వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ 157 మెడికల్​ కళాశాలలో  ఒక్క మెడికాల్ కళాశాల తెలంగాణకు ఇవ్వబోమని, వందసార్లు అడిగినా ఇవ్వలేదని ఆరోపించారు. అలాగే నవోదయ పాఠశాలలు ఇవ్వాలని అడిగినా దానిని తిరస్కరించారని మండిపడ్డారు. అభివృద్ధిలో గజ్వేల్ అందరికి రోల్ మాడల్ అయ్యిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తిరిగి ప్రభుత్వం ఏర్పడ్డాక గజ్వేల్ నియోజకవర్గంలో అన్ని దళిత కుటుంబాలకు ఒకే విడతలో దళితబంధు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి ని చూడడానికి ఇతర దేశాలనుంచి టూరిస్ట్ లు వస్తున్నారని అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో కొండపోచమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. గజ్వెల్ లో ఐటీ టవర్ లు ఏర్పాటు చేసే బాధ్యత తనదని అన్నారు. ప్రతి మండలంలో ఒక మార్కెట్ యార్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే మల్లన్నసాగర్​ ముంపు ముంపు గ్రామాల ప్రజల త్యాగాన్ని కొనియాడారు. ఆసియాలోనే అతి పెద్దదైన 50 టీఎంసీల మల్లన్న సాగర్  ముంపు గ్రామాల ప్రజల త్యాగం వెలకట్టలేనిది సీఎం కేసీఆర్ అన్నారు. అక్కడే పరిశ్రమలు స్థాపించి వారి కుటుంబాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.

వరంగల్ వీరభూమికి శిరసువంచి నమస్కరిస్తున్నా 
వరంగల్‌ : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ మంగళవారం వరంగల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. తెలంగాణ చరిత్ర వైభవానికి, వెయ్యేండ్ల తెలంగాణ చరిత్రకు సాక్షీభూతంగా ఉన్న ఈ వరంగల్ వీరభూమికి తాను శిరసువంచి నమస్కరిస్తున్నానని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక కీలక ఘట్టాలకు వరంగల్‌ పట్టణమే వేదికగా నిలిచిందని గుర్తు చేశారు. ఉద్యమంలో అతి భారీ బహిరంగ సభ ఈ వరంగల్‌ నగరంలోనే జరిగిందన్నారు. భద్రకాళీమాత ఆశీర్వాదంతో మనం తెలంగాణ సాధించుకున్నమని అన్నారు. అమ్మవారికి కిరీట ధారణ చేసి తాను మొక్కు కూడా చెల్లించుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వ‌రంగ‌ల్ వెస్టు అభ్యర్థి దాస్యం విన‌య్ భాస్కర్, వ‌రంగ‌ల్ ఈస్ట్ అభ్యర్థి న‌న్నప‌నేని న‌రేంద‌ర్‌కు మద్దతుగా మాట్లాడారు.  మీరు వేసే ఓటు తెలంగాణతోపాటు వరంగల్‌ ఈస్ట్‌, వెస్ట్‌ నియోజకవర్గాల ఐదేండ్ల భవిష్యత్ ను నిర్ణయిస్తుందన్నారు.

అసుంటి ఓటును ఆషామాషీగా వేయొద్దని సూచించారు.  మంచి అభ్యర్థికి, మంచి పార్టీకి వేయాలని కోరారు.  అప్పుడే మంచి జరుగుతది అని చెప్పారు.  వ‌రంగ‌ల్ ఈస్ట్, వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ ఇద్దరు టైగ‌ర్లను గెలిపించేందుకు.. ఈ వ‌రంగ‌ల్‌లోనే ఆకాశాన్నే ముద్దు పెట్టుకుంటా అని లేస్తున్న 24 అంత‌స్తుల బిల్డింగ్ చాలదా..? అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.     హైద‌రాబాద్ న‌గ‌రంలా వ‌రంగ‌ల్ త‌యారు కావాల‌ని విన‌య్ భాస్కర్ అంటున్నాడు. తెలంగాణ‌లో రెండో అతిపెద్ద న‌గ‌రం వ‌రంగ‌ల్ కాబ‌ట్టి.. ఐటీ ప‌రిశ్రమ‌లు వ‌చ్చాయి. భ‌విష్యత్‌లో ఐటీ ప‌రిశ్రమ‌ల‌కు వ‌రంగ‌ల్ ఆల‌వాలం కాబోతుంది. వ‌రంగ‌ల్ అభివృద్ధి ఇప్పుడే ప్రారంభ‌మైంది. ఇది ఆగ‌దు. ఈ ఇద్దరిని గెలిపించ‌డానికి ఈ వ‌రంగ‌ల్‌లో ఆకాశాన్నే ముద్దు పెట్టుకుంటా అని లేస్తున్న 24 అంత‌స్తుల బిల్డింగ్ చాల‌దా..? ఆ ఒక్క హాస్పిట‌ల్ బిల్డింగ్ చాల‌దా..? ఇద్దరిని గెలిపించ‌డానికి అని వ్యాఖ్యానించారు.