మైనర్లు వాహనాలు నడపరాదు: ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్

మైనర్లు వాహనాలు నడపరాదు: ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్

మైనార్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: గద్వాల:మైనర్లు వాహనాలు నడపరాదని గద్వాల పట్టణ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ భాస్కర్ తెలిపారు. బుధవారం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం పరిధి ఆవరణలో మైనర్లకు  ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్. మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండని మైనర్లు నడపరాదని, 18 సంవత్సరాలు నిండకుండా వాహనాలు నడిపి తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. సెల్ ఫోన్లు మాట్లాడుతూ రోడ్లు దాటొద్దని తెలిపారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపరాదన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాల ని లేనియెడల కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. మైనార్లు నడిపిన వాహనాలను స్టేషన్కు తరలించారు. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి తరువాత వాహనాలను అప్పగిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.