మైనర్లు డ్రైవింగ్ మరియు చలనాలపై స్పెషల్ డ్రైవ్: ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్

మైనర్లు డ్రైవింగ్ మరియు చలనాలపై స్పెషల్ డ్రైవ్: ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: మైనర్ వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ

గద్వాల: మైనర్లు వాహనాలు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారి యొక్క తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని గద్వాల ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ భాస్కర్ అన్నారు. మంగళవారం గద్వాల పట్టణ కేంద్రంలోని సుంకులంమ్మ మెట్టు పరిధిలో లో వాహన తనిఖీలు మరియు ట్రాఫిక్ చలనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు కూర్చుని డ్రైవింగ్ చేసినా, ట్రాఫిక్ రూల్స్ పాటించక పోయినా భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

ప్రమాదాలు నివారణ కొరకే చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పడం లేదని అన్నారు. వాహనదారులు పెండింగ్‌లో ఉన్న చలానాలు చెల్లించాలని ట్రాఫిక్‌ ఎస్సై విజయ్ భాస్కర్  తెలిపారు. అనంతరం పెండింగ్‌ చలానాలపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. పెండింగ్‌ చలానాల చెల్లింపునకు గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం, ఆన్‌లైన్‌, మీసేవాలను ఉపయోగించుకుని చెల్లించవచ్చని సూచించారు. మోటార్ సైకిల్ వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని, కారు డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించి నడపాలని, ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటించి క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది గోపాల్, సుధాకర్ పాల్గొన్నారు.