రాహుల్ గాంధీని పార్లమెంటు సభ్యత్వం నుండి రద్దు చేయడం హేయమైన చర్య: పట్టణ అధ్యక్షుడు ఇసాక్

రాహుల్ గాంధీని పార్లమెంటు సభ్యత్వం నుండి రద్దు చేయడం హేయమైన చర్య: పట్టణ అధ్యక్షుడు ఇసాక్

రాహుల్ గాంధీని పార్లమెంటు సభ్యత్వం నుండి రద్దు చేయడం హేయమైన చర్య : పట్టణ అధ్యక్షుడు ఇసాక్

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: గద్వాల్ : రాహుల్ గాంధీని పార్లమెంట్ సభ్యుడుగా తొలగించి రెండు సంవత్సరాలుగా జైలు శిక్ష విధించడం ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న చర్య హీనం అని పట్టణ అధ్యక్షుడు ఇసాక్ పేర్కొన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద మహాత్మాగాంధీ కి వినతి పత్రం అందజేసి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఇసాక్ మాట్లాడుతూ 2019 సంవత్సరం లో దేశంలో మోడీ లాంటి దొంగలు పడ్డారని అనే మాట రాహుల్ గాంధీ అన్నారని ఈ చిన్న మాటకు సూరత్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించడం దారుణమైన చర్య అని ఆరోపించారు.

రాహుల్ గాంధీ లాంటి నాయకుడు దేశానికి ఆదర్శంగా ఉంటూ ప్రజల కోసం పని చేస్తున్నార ని అన్నారు. ప్రజల కోసం ప్రశ్నించే నాయకుడు రాహుల్ గాంధీని భారత్ జోడో నఫరత్ చోడో అనే పాదయాత్రను 3600 కిలో మీటర్ల చేసి ప్రజలను ఒకతాటిపై తెచ్చేందుకు పాదయాత్ర చేశారని పేర్కొన్నారు.బీజేపీ రాజకీయంగా ఎదురుకొని శక్తి లేక ప్రశ్నించే గొంతును సంకెళ్లు వేసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజానీకం రాహుల్ గాంధీ కి మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చారు