కేతేపల్లి లో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం

కేతేపల్లి లో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం

ముద్ర,పానుగల్: పానుగల్ మండలం కేతేపల్లి గ్రామంలో బుధవారం నూతన గ్రామపంచాయతీ భవనాన్ని డిసిసిబి డైరెక్టర్, సింగిల్విండో చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ అనిత శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ శ్యామల హనుమంతురెడ్డి లు ప్రారంభించారు. ఐదు సంవత్సరాల పదవీకాలంలో గ్రామాభివృద్ధికి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డు సభ్యులు అహర్నిశలు కృషి చేశారని అన్నారు.

నేటితో సర్పంచుల పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా గ్రామ సర్పంచ్ అనిత దంపతులను,ఉప సర్పంచ్ శంకరమ్మ దంపతులను, వార్డు సభ్యులను సింగిల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ పార్టీ నాయకులు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.అనంతరం మాజీ సర్పంచులు చెన్నయ్య, ఊషన్న, కళావతమ్మ లను కూడా పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హరిత, గ్రామపంచాయతీ సిబ్బంది, కాంగ్రెస్, టిఆర్ఎస్, సిపిఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు.