ముఖ్యమంత్రి సభ రూట్ మ్యాప్ పై పోలీసుల సమీక్ష

ముఖ్యమంత్రి సభ రూట్ మ్యాప్ పై పోలీసుల సమీక్ష
Police review on Chief Minister meeting route map

ఖమ్మం, ముద్ర ప్రతినిధి : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్రావు  ఈ నెల 18న జిల్లా కేంద్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్, ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ శుక్రవారం పోలీస్ అధికారులతో కలసి రూట్ మ్యాప్, పోలీస్ బందోబస్తు ఏర్పాట్ల పై సమీక్ష జరిపారు. ట్రాఫిక్ సమస్య , పార్కింగ్ అంతరాయం కాకుండా పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.