ఎన్నికల లెక్కింపు సజావుగా నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

ఎన్నికల లెక్కింపు సజావుగా నిర్వహించాలి -  జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: లోకసభ ఎన్నికల లెక్కింపు సజావుగా, ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు లెక్కించాలనీ జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ లకు శిక్షణ శిభిరం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లోకసభ ఎన్నికల కౌంటింగ్ ఎన్నికల నిబంధనల మేరకు చేపట్టాలని అన్నారు. కౌంటింగ్ కు కేటాయించబడిన సిబ్బంది సమయానికి హాజరుకావాలని అన్నారు.

ఎలాంటి తప్పులకు తావివ్వకుండా సమయ స్ఫూర్తి తో విధులు నిర్వహించాలని అన్నారు. ఓట్ల లెక్కింపు కు కేతాయించబడిన సిబ్బంది చివరి వరకు వారు ఎలాంటి లెక్కింపు చేపట్టాలో చివరి ర్యాండమైజేశన్ తరువాత తెలుస్తుందని తెలిపారు. కౌంటింగ్ కు కేటాయించబడిన సిబ్బంది పోస్టల్ బ్యాలెట్, కంట్రోల్ యూనిట్, వి.వి. ప్యాట్ ల లెక్కింపులు కేటాయించవచ్చని తెలిపారు. లెక్కింపు సమయంలో జాగ్రత్తగా ఎలాంటి తప్పులు లేకుండా విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాలను ఉదయం నుండి మాస్టర్ శిక్షకులు పడాల తిరుపతి వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ పి. రాంబాబు, జగిత్యాల, మెట్ పల్లిఆర్డీఓ లు పి.మధుసూదన్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.