రమేష్ రాథోడ్  మృతి పట్ల బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దిగ్భ్రాంతి

రమేష్ రాథోడ్  మృతి పట్ల బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దిగ్భ్రాంతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు, బిజెపి నాయకులు రాథోడ్ రమేష్ హఠాన్మరణంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం  చేశారు.ఆయన ఆకస్మిక మరణం బీజేపీకి తీరని లోటని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ లో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా, శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధికి, గిరిజనుల అభ్యున్నతికి అండగా నిలిచారన్నారు. రమేష్ రాథోడ్ అకాలమరణం అందరిని కలచివేసిందన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు.