ఎమ్మెల్యే చే డయాలసిస్ కేంద్రం ప్రారంభం

ఎమ్మెల్యే చే డయాలసిస్ కేంద్రం ప్రారంభం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా భైంసా ప్రభుత్వాసుపత్రిలో ఐదు పడకల డయాలసిస్ కేంద్రాన్ని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఐదు పడకల సామర్థ్యంతో దీన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న పలువురు బాధితులు డయాలసిస్ నిమిత్తం నిర్మల్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితిని అధిగమించేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.