ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలి: నిర్మల్ సి ఐ పురుషోత్తమా చారి 

ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలి: నిర్మల్ సి ఐ పురుషోత్తమా చారి 

ముద్ర ప్రతినిధి , నిర్మల్: ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని నిర్మల్ సీఐ పురుషోత్తమా చారి సూచించారు. నిర్మల్ డీ ఎస్పీ గంగారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇందులో భాగంగా నంబర్ ప్లేట్లు లేని, లైసెన్స్ లేని వాహనదారులను, మైనర్ డ్రైవింగ్ చేసే  55 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో  వారికి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.అలాగే  లైసెన్స్ లేని 22 మందికి లైసెన్స్ పొందేందుకు పేర్లు నమోదు చేయించారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు బిగించిన ద్విచక్ర వాహనాలపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సైలు దేవేందర్, రాజశేఖర్, లింబాద్రి, ఏ ఎస్సై వర్మ, సిబ్బంది పాల్గొన్నారు.