గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్

గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్
  • 70 కిలోల గంజాయి స్వాధీనం
  • చాకచక్యంగా వ్యవహరించిన వన్ టౌన్ పోలీసులు
  • పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేంద్రం లో భారీగా గంజాయిని వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సరిలాల్ ఆధ్వర్యంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగర శివారులోని తీగలవంతెన వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సిఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాధానం స్పష్టంగా లేకపోవడంతో...క్షుణ్ణంగా తనిఖీ చేయగా గంజాయి పెద్ద ఎత్తున తరలిస్తున్నట్లు గుర్తించారు. సుమారు 35 ప్యాకెట్లలో పొడి గంజాయిని కార్ వెనక సీట్ కింద దాచి ఉంచి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఆ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని పోలీసులు  విచారిస్తున్నారు.