భక్తి శ్రద్ధలతో హనుమత్ జయంతి.

భక్తి శ్రద్ధలతో హనుమత్ జయంతి.

మోత్కూర్ ,ముద్ర: మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాపురం గ్రామంలో ని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం లో,మండలంలోని అనాజీపురం గ్రామంలో ని అభయాంజనేయ స్వామి దేవాలయం లో అత్యంత భక్తిశ్రద్ధలతో హనుమత్ జయంతి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి సిందూరం ఆకు పూజ లను నిర్వహించారు. భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందించారు.