టికెట్ ఇవ్వండి గెలిచి చూపిస్తా - మాణిక్ ఠాక్రేను కలిసిన భూపాల్ నాయక్

టికెట్ ఇవ్వండి గెలిచి చూపిస్తా - మాణిక్ ఠాక్రేను కలిసిన భూపాల్ నాయక్

కేసముద్రం , ముద్ర: డోర్నకల్ నియోజకవర్గంలో అధికార టిఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయకులు దీటుగా ఢీకొనడంతో పాటు గెలిచే సత్తా తనకే ఉందని, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఆశీర్వదించాలని కోరుతూ ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇంచార్జి మాణిక్ ఠాక్రే ను నానావత్ భూపాల్ నాయక్ కలిసి విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి డోర్నకల్ నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్నట్లు ననావత్ భూపాల్ నాయక్ ఠాక్రే కు వివరించి తనకు టికెట్ ఇస్తే గెలిచి మీ ముందు ఉంటానని చెప్పినట్లు తెలిపారు.