నైజీరియాలో వరుస బాంబుదాడులు.. 18 మంది దుర్మరణం  

నైజీరియాలో వరుస బాంబుదాడులు.. 18 మంది దుర్మరణం   

Nigeria: నైజీరియా దేశంలో జరిగిన వరుస బాంబు దాడులలో సుమారు 18 మంది మృతి చెందగా, మరో 48 మంది గాయపడ్డారు. తొలుత ఒక వివాహ వేడుకలో, తర్వాత గ్వోజాలోని  ఒక ఆస్పత్రిలో, మూడో బాంబ్ ఒక అంత్యక్రియల ప్రదేశంలో జరిగింది. నైజీరియాలోని ఉత్తర బోర్నో రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక వివాహ వేడుకలో జరిగింది. ఈ పేలుడు తర్వాత వరుసగా మరో రెండు పేలుళ్లు సంభవించాయి. బోర్నో స్టేట్ ఎమర్జెన్సీ మేనేజిమెంట్ ఏజెన్సీ (సెమా) డైరెక్టర్ బర్కిండో ముహ్మమ్మద్ సైదు సంటననా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చనిపోయిన వారిలో పలువురు మహిళలు, పిల్లలు ఉన్నారని ఆయన తెలిపారు. అంతకుమించి వివరాలేమీ ఇవ్వలేదు.    అంతకుముందు జూన్ 25న టెర్రరిస్టుల గ్రూప్ దాడిలో 21 మంది నైజీరియన్ సైనికులు మృతి చెందారు.