‘మా నాన్న డొనాల్డ్‌ ట్రంప్‌ చనిపోయారు’!

‘మా నాన్న డొనాల్డ్‌ ట్రంప్‌ చనిపోయారు’!

జూనియర్‌ ట్రంప్‌ ట్వీట్‌ వైరల్‌
ముద్ర, తెలంగాణ బ్యూరో : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చనిపోయారన్న వార్త ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ మేరకు ఆయన కుమారుడు జూనియర్‌ ట్రంప్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ట్రంప్‌ మృతికి సంబందించిన వార్త పోస్టు దర్శనం ఇచ్చింది. ‘ఈ వార్త తెలియజేసేందుకు చింతిస్తున్నాను. మా నాన్న డొనాల్డ్‌ ట్రంప్‌ మృతిచెందారు. 

2024 ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష స్థానానికి నేను పోటీ చేస్తాను’ అంటూ జూనియర్‌ ట్రంప్‌ అధికారి ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు దర్శనమిచ్చింది. క్షణాల్లో ఈ పోస్టు వైరల్‌ అయ్యింది. అయితే, జూనియర్‌ ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌ అయినట్లు తర్వాత తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన టెక్నికల్‌ టీమ్‌ జూనియర్‌ ట్రంప్‌ ఖాతాను తిరిగి పునరుద్ధరించారు. అందులో హ్యాకర్లు చేసిన పోస్టులను తొలగించారు.